'నా చేయి పట్టుకుని నడవాలని లేదు'.. Allu Arjunపై Chiranjeevi షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
నా చేయి పట్టుకుని నడవాలని లేదు.. Allu Arjunపై Chiranjeevi షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ తనపై ఉన్న మెగా ట్యాగ్‌ను తీసేయాలని భావిస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై ఇప్పటికైనా మీరు స్పందించాలని ఓ జర్నలిస్ట్ చిరంజీవిని అడగడం జరిగింది.

కాగా దీనిపై మాట్లాడిన చిరు.. 'ప్రతిసారీ నా గురించి, మెగాస్టార్ ట్యాగ్ గురించి ప్రస్తావించడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. మొదట నేను పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అవ్వాలని కోరుకున్నాను. అంతకు మించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా మంచి హీరోలు కావాలని కోరుకున్నాం. అనుకున్న విధంగా వాళ్లు స్టార్ హీరోలు కావడంతో ప్రస్తుతం అందరం సంతోషంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ వీళ్లంతా నా చేయి పట్టుకొని ఎదిగినవారే. కానీ ఇప్పుడు కూడా వాళ్లు నా చేయి పట్టుకుని నడవాలని లేదు' అని బన్నీకి సపోర్టింగ్‌‌గా మాట్లాడాడు చిరు.

Also Read....

రాజమౌళి డ్రెస్సింగ్‌పై కంగన ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్


Next Story

Most Viewed