పొలిటికల్ రీ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!

by Disha Web Desk 19 |
పొలిటికల్ రీ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాలపై టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని.. లేనని చెబుతున్నప్పటికీ దానిపై ఇంకా అనుమానాలు ఎందుకు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భవిష్యత్‌లో తాను వందశాతం రాజకీయాల్లోకి రానని చిరు తేల్చి చెప్పారు. నా కుటుంబం నుండి ఒకరు రాజకీయాల్లోకి వెళ్తే నాకు సంబంధమేంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఉన్నా, సొంత పార్టీ పెట్టుకున్నా.. ఎంతైనా గానీ అతడు నా తమ్ముడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సైతం చిరు షాకింగ్ కామెంట్స్ చేశారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల గురించి నాకేందుకని.. తనకు ఓటున్న రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి తాను కూడా పేపర్ చూసే అన్ని విషయాలు తెలుసుకుంటానన్నారు. మెగా బ్రదర్స్ ముగ్గురికీ రాజకీయ భవిష్యత్ లేదన్న మంత్రి రోజా వ్యాఖ్యలపై సైతం చిరు స్పందించారు. ఆమెతో మాకైతే ఎలాంటి మనస్పర్థలు లేవని.. మంత్రి అయ్యాక కూడా రోజా మా ఇంటికి వచ్చారని తెలిపారు. తమపై రోజా చేసిన వ్యాఖ్యలకు కారణం ఆమెనే ఆడగాలని చిరు వ్యాఖ్యానించారు.]

READ MORE

'జీ2' అంచనాలకు మించి ఉంటుంది: ప్రీ విజన్ లాంచ్‌లో అడివి శేష్


Next Story