తమ్ముడికి సాయం చేయడం సంతోషాన్నిచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్

by Disha Web Desk 2 |
తమ్ముడికి సాయం చేయడం సంతోషాన్నిచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీకి తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం చేశారు. ఎన్నికల వేళ రూ.5 కోట్లు పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా(ఎక్స్) తెలియజేశారు. ‘‘అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్‌లో జరుగుతుండగా.. పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్‌కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్‌లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు.




Next Story

Most Viewed