చిరంజీవి కూతురు ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. చెప్పలేనంత ప్రేమ ఉందటూ..

by Web Desk |
చిరంజీవి కూతురు ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. చెప్పలేనంత ప్రేమ ఉందటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి కూతురు శ్రీజ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆమె భర్త కళ్యాణ్ దేవ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శ్రీజ పెట్టిన ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ పోస్ట్‌లో ' బర్త్ డే శుభాకాంక్షలు తమ్ముడు. పొడవుగా ఉన్నంత మాత్రాన తెలివి అయిన వాళ్లం అనిపించుకోలేమంటూ ఆటపట్టించింది. వరుణ్ తేజ్ వల్ల నా బాల్యం చాలా ఆనందంగా గడిచిందని పేర్కొంది. ఎన్నో విషయాలలో వరుణ్ నాకు అండగా నిలిచాడని తెలిపింది. తమ్ముడిపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉందని' ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. బాక్సింగ్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న 'గని', కామెడీ జోనర్ మూవీ ఎఫ్ 3 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.



Next Story

Most Viewed