- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. ఆందోళనలో మెగాఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu).

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ఇందులో చిరుకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లోకి రానుంది. అయితే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. అందరి దృష్టిని తమ సినిమాపైకి వచ్చేలా డిఫరెంట్ ఐడియాస్‌తో ప్రయత్నిస్తున్నారు. ఇక మూవీ కోసం నయనతార కూడా రంగంలోకి దిగి తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తోంది. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం అన్నింటికి దూరం ఉంటున్నారు. అనిల్ రావిపూడి, నయన్‌తో పలు ఆసక్తికర వీడియోలు చేస్తున్నప్పటికీ అందులో చిరు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హీరోకు, డైరెక్టర్‌కు మధ్య ఏవైనా వివాదాలు జరిగాయా? లేక ఏదైనా అయిందా? అని నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈక్రమంలో.. తాజాగా, ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగినట్లు అందుకే ఆయన ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నట్లు టాక్. గత కొద్ది కాలంగా ఆయన మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతుండగా.. సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ తన బాధను ఓర్చుకొని ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూట్ పూర్తి చేశారట. కానీ నొప్పి ఎక్కువ కావడంతో షూట్ పూర్తి కాగానే.. వెంటనే చిరు సర్జరీ చేయించుకున్నారని టాక్. అందుకే.. అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అయితే ఈ విషయాన్ని ఆయన టీమ్ రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేయడంతో పాటు ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.






