- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవిపై అసభ్యకరమైన పోస్టులు.. బికినీ వేసి మరీ ?
మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం ఎదురైంది. చిరంజీవి బికినీ వేసుకున్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి, వైరల్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం ఎదురైంది. ఆయనపై అసభ్యకరమైన పోస్టర్లు పెట్టి, కొందరు దారుణానికి ఒడిగట్టారు. చిరంజీవి బికినీ వేసుకున్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి, వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్నారు.
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బికినీ వేసుకున్నట్లు కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి.. ట్రోలింగ్ చేస్తున్నారు. అది కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమా పోస్టర్ ను మార్ఫింగ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై మెగాస్టార్ అభిమాన సంఘం సీరియస్ అవుతోంది. రేపు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.






