- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi: గాయంతో కనిపించి షాకిచ్చిన చిరంజీవి.. ఆందోళన చెందుతున్న అభిమానులు
చిరంజీవి తన ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకొని కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

దిశ, సినిమా: మెగా కుటుంబంలో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అటు రామ్ చరణ్‌కు కవలలు జన్మించడంతో డబుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే.. మెగా మేనల్లుడు, అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish)తన పెళ్లి కబురుతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి సంబంధించి, మొదటి ఆహ్వాన పత్రికను మేనమామ చిరంజీవి, మేనత్త సురేఖలకు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు శిరీష్ పెళ్లి పత్రిక ఇస్తున్న సమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫోటోలో చిరంజీవి తన ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకొని కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
షూటింగ్‌లో గాయపడ్డారా
బాస్ చేతికి ఏమైంది?, షూటింగ్‌లో గాయపడ్డారా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ముఖంలో చిరునవ్వు ఉన్నప్పటికీ, ఆ హ్యాండ్ సపోర్ట్ బెల్ట్ చూస్తుంటే ఏదో చిన్నపాటి గాయం లేదా సర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న అల్లు శిరీష్, సడన్‌గా తన పెళ్లి కార్డుతో అందరి ముందుకు రావడం విశేషం. సంప్రదాయబద్ధంగా బట్టలు పెట్టి మరీ తన మేనమామను ఆహ్వానించారు. ఈ ఫోటోలో అల్లు శిరీష్, చిరంజీవి, సురేఖ గారు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అయితే చిరంజీవి చేతి గాయంపై మెగా ఫ్యామిలీ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయినప్పటికీ ఫొటో చూసిన అభిమానులు ఆందోళన చెందుతూ.. త్వరలోనే ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.






