బన్నీకి అభినందనలు తెలిపిన చిరు.. గర్వంగా ఉందంటూ

by Disha Web Desk 9 |
బన్నీకి అభినందనలు తెలిపిన చిరు.. గర్వంగా ఉందంటూ
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న బన్నీపై చిరు ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టిన మెగాస్టార్.. ‘డియర్ బన్నీ.. నీవు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీ చిన్నతనంలోని జ్ఞాపకాలు నా మదిలో ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం వరకు.. మొత్తం నీ ఎదుగుదలని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. రానున్న కాలంలో నీవు మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ అల్లుడితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

ఇక ఈ ట్వీట్‌కు రీ ట్వీట్ చేసిన అర్జున్.. ‘మీ అద్భుతమైన ఆశీర్వాదాలకు చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ నా హృదయంలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుంది. ధన్యవాదాలు చికాబాబీ’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పడినట్లైంది.

ఇవి కూడా చదవండి: రాయల్ లైఫ్ వదులుకుని.. సాధారణ అమ్మాయిగా జీవించేస్తోంది..




Next Story

Most Viewed