సంక్రాంతికి టాలీవుడ్‌లో బిగ్ ఫైట్.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

by Disha Web Desk 2 |
సంక్రాంతికి టాలీవుడ్‌లో బిగ్ ఫైట్.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లోని చాలా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా అగ్రహీరోలు ఏమాత్రం తగ్గకుండా పోటీ పడుతున్నారు. వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగా’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజసజ్జ ‘హనుమాన్’ చిత్రాలు ఈ సంక్రాంతి పండక్కి విడుదల కానున్నాయి. దీంతో థియేటర్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. తాజాగా.. ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆదివారం ‘హనుమాన్’ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఈ ఇష్యూపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.

సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని చిత్రాలు అద్భుతమైన విజయం సాధించాలని కోరుకున్నారు. థియేటర్ల ఇబ్బంది ఉందని ఎవరూ బాధపడొద్దని.. అంతిమంగా ప్రేక్షకులు వారికి నచ్చిన సినిమాకే మొగ్గుచూపుతారని చెప్పారు. కాస్త లేట్ అయినా నచ్చిన సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని అన్నారు. గతంలో కూడా ఇలాంటి పోటీ ఉందని.. ఆ నాడు విడుదలైన అన్ని సినిమాలు అద్భుతంగా కలెక్ట్ చేశాయని వెల్లడించారు. ఇప్పుడు కూడా విడుదలైన అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలని.. అన్నింటికీ మంచి కలెక్షన్లు రావాలని ఆకాంక్షించారు.



Next Story

Most Viewed