- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో చిరంజీవి రొమాన్స్... నెవ్వర్ బిఫోర్ రేంజ్ లో !
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రీ-

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రీ-ఎంట్రీలో డిజాస్టర్ లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి సక్సెస్ దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనిల్ కూడా... మెగాస్టార్ చిరంజీవితో మంచి హిట్ కొట్టాలని కథ రెడీ చేశాడు.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో హీరోయిన్ నయనతార (Nayanatara) రొమాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి అలాగే నయనతార మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందట. ఈ సాంగ్ ను కేరళలోని అలెప్పి (Alappuzha) అనే ప్రాంతంలో చేయాలని అనుకుంటున్నారట. ఇందుకోసం.. ఇప్పటికే కేరళలోనే చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్స్ ను అనిల్ రావిపూడి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఒక్క పాట కోసం వారం రోజుల సమయం తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో షూటింగ్ పూర్తి చేసుకుంటుందని అంటున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.






