పవన్ కళ్యాణ్ పేరును చిరంజీవి ఫోన్‌లో ఎలా ఫీడ్ చేసుకున్నాడంటే..!

by Dishanational4 |
పవన్ కళ్యాణ్ పేరును చిరంజీవి ఫోన్‌లో ఎలా ఫీడ్ చేసుకున్నాడంటే..!
X

దిశ, సినిమా: 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి.. 'సుమ అడ్డా'కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తాజాగా విడుదలైన ఇందుకు సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా ఉండగా.. పవన్ కళ్యాణ్‌ పేరును తన ఫోన్‌లో ఏ విధంగా ఫీడ్ చేసుకున్నాడో చెప్పాడు చిరు. పవన్, పీకే అని కాకుండా కళ్యాణ్ బాబు అని పెట్టుకున్నట్లు తెలిపాడు. కాగా ఇది విన్న ఫ్యాన్స్ ఖుష్ అవుతూ.. కామెంట్ చేస్తున్నారు. అలాగే భార్య సురేఖ పేరును 'రే' అని ఫీడ్ చేసుకున్నానన్న చిరు.. ఇప్పటికీ తన తండ్రితో గడిపిన క్షణాలు గుర్తున్నాయని, ఆయన మళ్లీ తిరిగి వస్తే ఎక్కువ సమయం అతనితోనే ఉండాలని ఉందని ఎమోషనల్ అయ్యాడు.

READ MORE

'వీర సింహారెడ్డి' డైలాగులకు స్పీకర్లు పగిలిపోతాయి: థమన్


Next Story

Most Viewed