- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
21 మంది మృతి.. కీలక నిర్ణయంతో బిగ్ షాకిచ్చిన మూవీ మేకర్స్.. వాయిదా వేస్తూ ప్రకటన
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు జరుగుతూ జనాలకు వణుకు పుట్టేలా చేస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు జరుగుతూ జనాలకు వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదం కారణంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువముందే.. చేవెళ్ల మండల పరిధిలో ఈరోజు ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో మొత్తం 21 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఇక ఈ విషాధ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ సంఘటనతో నాగచైతన్య ‘NC-24’ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబాలను సానుభూతి తెలియజేస్తూ.. విడుదల చేస్తామని ప్రకటించి అప్డేట్‌ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో నోట్ రిలీజ్ చేశారు. ‘‘చేవెళ్లలో జరిగిన దురదృష్టకర సంఘటనలో బాధిత కుటుంబాలకు ‘NC24’ బృందం సంఘీభావం తెలుపుతోంది. అందరికీ శాంతి కలగాలని కోరుకుంటున్నాము.
రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జరిగిన విషాద సంఘటన మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ దురదృష్టకర సంఘటన దృష్ట్యా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury)క్యారెక్టర్ పోస్టర్ విడుదలను వాయిదా వేయాలని ‘NC-24’ టీమ్ నిర్ణయించింది. ఈ విషాదం వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, శాంతి కలగాలని కోరుతున్నాం’’ అని రాసుకొచ్చారు. దీంతో మీనాక్షి అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.






