Salman Khan కోసం చరణ్ నుంచి ఖరీదైన సర్‌ప్రైజ్

by Hajipasha |   (  Updated:2022-10-11 07:22:50  IST  )

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'.Latest Telugu News

Salman Khan  కోసం చరణ్ నుంచి ఖరీదైన సర్‌ప్రైజ్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. విజయదశమి కానుకగా ఈ నెల 5న భారీ ఎత్తున విడుదలైన చిత్రం తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా.. హిందీలోనూ మంచి వసూళ్లు రాబట్టేందుకు కారణమయ్యారు సల్మాన్. ఇంత చేసినా ఈ సినిమాలో నటించినందుకు తను రెమ్యూనరేషన్ తీసుకునేందుకు నిరాకరించాడని చిరంజీవి సక్సెస్ మీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో సల్మాన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని, ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఇక ముందు నుంచి కూడా సల్మాన్‌కు చిరు ఫ్యామిలితో మంచి అనుబంధం ఉంది. మరి ఈ ఖరీదైన గిఫ్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి : శ్రీవారిని దర్శించుకున్న Anil Ambani, Abhishek Bachchan..

Next Story