‘పెద్ది’ షూటింగ్ ఆపేద్దామన్నా చరణ్ వినలేదు.. ఆ రోజు ఇంకా గుర్తుందంటూ బుచ్చిబాబు షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ షూటింగ్‌లో జరిగిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

‘పెద్ది’ షూటింగ్ ఆపేద్దామన్నా చరణ్ వినలేదు.. ఆ రోజు ఇంకా గుర్తుందంటూ బుచ్చిబాబు షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’(peddi). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ప్రశంసల జల్లు కురిపించగా, దానికి స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. చిరంజీవి, ‘రై రై రారా’ పాట అద్భుతంగా ఉందని కొనియాడారు. ‘‘ఈ పాట శక్తి, భావోద్వేగం సినిమాటిక్ ప్రకాశానికి నిదర్శనం. చరణ్ కదులుతున్న తీరు, అతని ఎనర్జీ చూస్తుంటే తండ్రిగా నాకు ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యాజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు విజువల్స్, అనంత శ్రీరామ్ సాహిత్యంపై చిరు ప్రశంసలు కురిపించారు. నిర్మాత వెంకట సతీష్ కిలారును కూడా ఆయన అభినందించారు.

చిరంజీవి ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ బుచ్చిబాబు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘‘ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సార్.. ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సార్‌కు తీవ్రమైన జ్వరం ఉంది. జ్వరం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ ఆపేద్దామని మేము అన్నాము. కానీ చరణ్ సార్ మాత్రం లేదు చేద్దాం అని పట్టుబట్టారు. అంత జ్వరంలో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో ఆయన డ్యాన్స్ చేశారు. ఆ డెడికేషన్, క్రమశిక్షణ అన్నీ మీ నుంచి వచ్చినవే సార్’’ అని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా చరణ్ చూపించిన అంకితభావం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘అదీ మెగా వారసుడి డెడికేషన్ అంటే’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందుకు శర్మ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story