చంద్రముఖి నటుడు ప్రభుకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

by Mallepaka Hamsa |   (  Updated:2023-02-22 03:25:53  IST  )

టాలీవుడ్ నటుడు ప్రభు మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు..

చంద్రముఖి నటుడు ప్రభుకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు ప్రభు మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు వైద్యం చేసిన వైద్యులు లేజర్ సర్జరీ చేసి కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ప్రభు సినిమాల విషయానికి వస్తే తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా ఇండస్ట్రీకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రజినీకాంత్ చంద్రముఖి, ప్రభాస్ డార్లింగ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సైడ్ క్యారెక్టర్లతో అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ప్రభు విజయ్ దళపతి 'వారిసు' సినిమాలో కూడా నటించారు.

Next Story