- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రింగ్.. ట్రింగ్.. ట్రెండింగో.. సాంగ్ లాంచ్
by Vinod kumar |
ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం ట్రెండింగ్.

X
దిశ, సినిమా: ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం ట్రెండింగ్. కాగా నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ ట్రెండ్ చేయాలని తపన పడేవారిని ఉద్దేశిస్తూ వస్తున్న సెటైరికల్ సాంగ్ ‘ట్రెండింగో’. రఘు కుంచె లిరిక్స్, కాన్సెప్ట్, సంగీత సారథ్యంలో శ్రీ నందన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ బ్యానర్‌పై టి. విజయలక్ష్మి నిర్మించగా కె.వి.కె. దర్శకత్వం వహించాడు. కాగా లయ, ఆర్.పి. పట్నాయక్, చంద్రబోస్, అనిల్ కన్నెగంటి, కరుణ కుమార్, లక్ష్మీ భూపాల్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ గీతాన్ని ఘనంగా విడుదల చేశారు. ఈ మేరకు మాట్లాడిన అతిథులు.. అమెరికాలోని డల్లాస్ నగరంలో అందమైన ప్రదేశాల్లో షూట్ చేసిన పాట అద్భుతంగా ఉందంటూ పాట బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు రఘు కుంచె.
Next Story






