ఓ వదినా.. చమ్కీల అంగిలేసి పాట పాడింది ఎవరే.. దీ కోసం గూగుల్ లో తెగ సెర్చింగ్..

by Disha Web Desk 20 |
ఓ వదినా.. చమ్కీల అంగిలేసి పాట పాడింది ఎవరే.. దీ కోసం గూగుల్ లో తెగ సెర్చింగ్..
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లోనే కాదు ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఒకే పాట వినిపిస్తోంది. సోషల్ మీడియాను వ్యూస్ తో షేక్ చేసి పడేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట తెలంగాణ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. న్యాచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా వస్తున్న దసరా చిత్రంలోనిదే ఈ పాట. చమ్కీల అంగిలేసి ఓ వదినే అంటూ ఒక ఊపు ఊపుతుంది. విడుదలైన అనతికాలంలోనే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ సమయంలోనే ఈ పాట వైరల్ కావడంతో అసలు పాట పాడిన గాయకులు ఎవరో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

ముఖ్యంగా పాట పాడిన ఫీమేల్ సింగర్ వాయిస్ నెటిజన్స్‏ను తెగ ఆకట్టుకోవడంతో ఆ సింగర్ ఎవరు అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పాటను పాడిన ఇద్దరు సింగర్స్ లో మేల్ సింగర్ అందరికీ సుపరిచితుడైన రామ్ మిరియాల. ఇక ఫిమేల్ సింగర్ విషయానికి వస్తే దీక్షిత అలియాస్ దీ ఈ పాటను పాడారు. దీక్షిత ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పాడినా లేటెస్ట్ గా వచ్చిన ఈ పాట మాత్రం ఒక్క రాత్రిలోనే తెగవైరల్ అయ్యి సింగర్ దీక్షిత కూడా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

దీక్షిత తనకు 14 ఏళ్లు ఉన్నప్పటినుంటే మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే పాట పాడి అభిమానులను ఆకట్టుకుంది. ఆ పాటకూడా సోషల్ మీడియాను ఒక్క సారిగా షేక్ చేసింది. దీక్షిత తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ. ఈయనే దసరా సినిమాకి సంగీతం అందిస్తుండడంతో తన కూతురితో ఈ పాట పాడించారు.

Also Read: ఇన్‌స్టాలో 400 మిలియన్ల ఫాలోవర్స్.. మొదటి మహిళగా సెలీనా..

Next Story

Most Viewed