Akhil Akkineni : చైతూ పైకి కనిపించినంత సైలెంట్ కాదు: అఖిల్ కామెంట్ వైరల్

by Disha Web Desk 9 |
Akhil Akkineni : చైతూ పైకి కనిపించినంత సైలెంట్ కాదు: అఖిల్ కామెంట్ వైరల్
X

దిశ, సినిమా: అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులముందుకు రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో అఖిల్ ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆయన.. నాగచైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ చాలా కూల్‌గా ఉంటుంది. తన నుంచి అది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నాన్న కూడా అంతే అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సినిమా విషయంలో సలహాలు ఇస్తారు. నాగచైతన్య గురించి చెప్పాలంటే.. చూడటానికి చాలా సైలెంట్‌, అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ, ఆయన పైకి కనిపించేంత సైలెంట్ కాదు. సైలెంట్ కిల్లర్. తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతాడు. అవసరం అయితేనే ఇతరుల సలహా అడుగుతాడు. అమ్మనాన్న లాగే చాలా కూల్’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read more:

‘హెడ్ అప్ హై’.. ‘కస్టడీ’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Next Story

Most Viewed