- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న సెలబ్రిటీలు మెచ్చిన సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
శశికుమార్(Shashi Kumar), సిమ్రాన్(Simran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist family).

దిశ, సినిమా: శశికుమార్(Shashi Kumar), సిమ్రాన్(Simran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist family). అయితే ఈ సినిమాను యూట్యూబర్ అయిన అభిషాన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించాడు. అయన ఈ చిత్రంతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించారు. అయితే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మూవీ సూర్య ‘రెట్రో’కు పోటీగా మే1న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో విడుదల కానప్పటికీ సినీ ప్రియులతో పాటు ఈ చిత్రాన్ని సెలబ్రిటీలు కూడా చూసి ప్రశంసలు కురిపించారు. నాని(nani), రాజమౌళి(Rajamouli) వంటి స్టార్స్ ఈ చిత్రంపై సోషల్ మీడియా ద్వారా పోస్టులు కూడా పెట్టారు. సినిమా చాలా సాదాసీదాగా ఉంటూనే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
అయితే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కేవలం తమిళం వరకే రిలీజ్ కావడంతో తెలుగు ఆడియెన్స్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. కానీ ఎన్ని భాషల్లో రానుందనేది ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.






