- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ ‘సూర్య-46’ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ సాధించలేకపోతున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ సాధించలేకపోతున్నాడు. అయినప్పటికీ హిట్ ఫ్లాప్ అని పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య, వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ‘సూర్య-46’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్, ఫార్ట్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సూర్య-46’ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన నేటి నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సూర్య స్టైలీష్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.






