సినిమాలలో నటించాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్..

by Disha Web Desk 7 |
సినిమాలలో నటించాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాలలో నటించాలనే తపన ఉండి చాన్స్ కోసం పడిగాపులు కాసేవారెందరో ఉన్నారు. ఒక్క చాన్స్ దొరికితే చాలు టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాం అని అనుకున్నవాళ్లకి సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. అదేంటో చూసేద్దాం..

''మా తదుపరి మూవీలో నంటించాలనుకునే వాళ్లకి ఇదొక అద్భుతమైన అవకాశం. మీ టాలెంట్‌ను నిరూపించుకుని.. మా ప్రొడక్సన్ 18లో అవకాశాన్ని సంపాదించుకోండి. అందరం కలిసి ప్రేక్షకులకు అద్భుతమైన జ్ఞపకాలను సృష్టిద్ధామని తెలిపింది. ఇక అందుకు సంబంధించి ఆడిషన్ క్లిప్‌ను [email protected] కి మెయిల్ చేయండి'' అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు ఈ ఆడిషన్స్‌కు కొన్ని కండీషన్స్‌ తెలిపింది. త్వరలో కాలేజీ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాకు కేవలం యువతి యువకులు మాత్రమే అర్హులు. అందులో పురుషుల ఏజ్ 18 నుంచి 24 మధ్య, అలాగే అమ్మాయిల ఏజ్ 16 నుంచి 24 మధ్య ఉండాలని పేర్కొంది. ఎవరైతే వీటిపై ఆసక్తి కలిగి ఉన్నారో వారు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేలా ఒక నిమిషం వీడియో క్లిప్‌ను 8801990954 నంబర్‌కు వాట్సాప్‌లో పంపించాలని కోరింది.


Next Story