- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ చరణ్ వర్సెస్ బన్నీ... సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన రచ్చ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) మధ్య మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. అయ

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) మధ్య మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ హీరోలు ఇద్దరు ఎలాంటి గొడవలు పడడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్... పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ ( Sri Ramanavami festival) ఉన్న నేపథ్యంలో... హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా (Peddi Movie) నుంచి అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ అంటూ ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
దీంతో ఇవాళ ఉదయం నుంచి... సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ దెబ్బకు వెంటనే అలర్ట్ అయిన అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు... రామ్ చరణ్ ఫ్యాన్స్ పై యుద్ధమే ప్రకటించారు. AA22 పేరుతో కొత్తగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ లో అతి త్వరలోనే సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీనిపై ఏప్రిల్ 8వ తేదీన.. అల్లు అర్జున్ బర్త్.. డే ఉంది. ఆ రోజునే A A22 మూవీ ప్రకటన రానుందని అంటున్నారు.
దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్ గా... ఇవాల్టి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ట్రెండింగ్ లో ఉన్న పెద్ది సినిమాను అల్లు అర్జున్ కొత్త సినిమా AA22 దాటేసింది. ఇక తాము తగ్గేదే లేదని... రామ్ చరణ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో.. కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి.
#AA22 🔥🚀Waiting !! pic.twitter.com/Vx7KixJYoa— SANJU 🚀 (@sanjureddy1425) April 6, 2025






