'బుట్ట బొమ్మ' కలర్‌ఫుల్‌గా ఉంటుంది: అనిక సురేంద్రన్

by Disha Web Desk 7 |
బుట్ట బొమ్మ కలర్‌ఫుల్‌గా ఉంటుంది: అనిక సురేంద్రన్
X

దిశ, సినిమా : అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బుట్ట బొమ్మ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన సినిమాకు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వ వహించాడు. కాగా జనవరి 26న ఈ మూవీ థియేటర్లలో విడుదలకానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిక సురేంద్రన్..

'బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన నేను ప్రస్తుతం హీరోయిన్‌గా నటించడం సంతోషంగా ఉంది. నా పాత్రలోని ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. సితార వంటి నిర్మాణ సంస్థతో పనిచేసే అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నా. ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కలర్ ఫుల్‌గా ఉంటుంది. దర్శకనిర్మాతలు, చిత్రబృందం మద్దతుతో ఒత్తిడికి గురికాకుండా పూర్తి చేయగలిగాను' అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమా విడుదలకుముందే తెలుగులో అవకాశాలు వస్తున్నాయని, మంచి కథలు దొరికితే నటించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిపింది.

READ MORE

రాఖీ సావంత్‌ను అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.. ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed