‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‌పై హైప్ పెంచిన బుచ్చిబాబు.. ఆ గ్రేస్‌ను చూస్తూ ఉండిపోయామంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

‘పెద్ది’ సినిమాలోని రెండో పాటను విడుదల చేసేందుకు సమయం ఖరారు చేసింది చిత్రబృందం.

‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‌పై హైప్ పెంచిన బుచ్చిబాబు.. ఆ గ్రేస్‌ను చూస్తూ ఉండిపోయామంటూ పోస్ట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchibabu Sana)కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’(peddi). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్‌తో మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా, చిత్ర యూనిట్ సినిమాలోని రెండో పాటను విడుదల చేసేందుకు సమయం ఖరారు చేసింది. మార్చి 2న సాయంత్రం 7:02 గంటలకు ‘రైయ్ రైయ్ రా రా’ అనే మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్పులు వేస్తున్న ఒక అదిరిపోయే పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. దీనికి జతగా బుచ్చిబాబు పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘‘ఒచ్చేస్తున్నం సార్.. ఈ సాంగ్‌లో మీ గ్రేస్ చూసి మేమంతా అలా ఉండిపోయాం. మా టీమ్ అంతా ఫుల్ జోష్‌లో ఉంది.. సాంగ్ వచ్చేస్తుంది సార్!’’ అంటూ రామ్ చరణ్‌ను ఉద్దేశించి ఆయన రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న ‘పెద్ది’ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఈ రెండో పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story