మాస్ సాంగ్ కోసం క్రేజీ భామను పట్టిన బుచ్చిబాబు.. ‘పెద్ది’లోకి ఆ గ్లామర్ డాల్ ఎంట్రీ?

by Mallepaka Hamsa |

చరణ్ లాంటి అద్భుతమైన డ్యాన్సర్ పక్కన ఆయేషా ఖాన్ వంటి ఎనర్జిటిక్ నటి తోడైతే, ఆ పాట బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

మాస్ సాంగ్ కోసం క్రేజీ భామను పట్టిన బుచ్చిబాబు.. ‘పెద్ది’లోకి ఆ గ్లామర్ డాల్ ఎంట్రీ?
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ గురించి మరో క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఉండే ఒక అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ కోసం చిత్ర యూనిట్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్‌ను తీసుకోబోతున్నట్లు టాక్. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలోని ‘షరారత్’ పాటతో సోషల్ మీడియాను ఊపేసిన ఆయేషా ఖాన్, తన డ్యాన్స్, గ్లామర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాటలో ఆమె వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులకు ఫిదా అయిన దర్శకుడు బుచ్చిబాబు, చరణ్ సరసన స్పెషల్ సాంగ్ కోసం ఆమెనే పర్ఫెక్ట్ అని భావించారట. చరణ్ లాంటి అద్భుతమైన డ్యాన్సర్ పక్కన ఆయేషా ఖాన్ వంటి ఎనర్జిటిక్ నటి తోడైతే, ఆ పాట బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా మృణాల్ ఠాకూర్, మానస వారణాసి వంటి పేర్లు వినిపించాయి. కానీ, ప్రస్తుతం యూత్‌లో ఆయేషా ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఆమె వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ ఈ సాంగ్ కోసం ఊర మాస్ ట్యూన్ సిద్ధం చేశారని, ఇది ‘పెద్ది’ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనుందని టాక్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 2026కు వాయిదా పడింది. అయితే, ఈ గ్యాప్‌లో వస్తున్న ఇలాంటి క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులను అలరించేలా ఆయేషా ఖాన్‌ను రంగంలోకి దించడం సినిమా బిజినెస్‌కు కూడా ప్లస్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయేషా ఖాన్ ఐటమ్ సాంగ్ ఒక కలర్‌ఫుల్ అట్రాక్షన్‌గా మారుతుందనడంలో సందేహం లేదని నెటిజన్లు అంటున్నారు.

Next Story