రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు (Buchibabu)కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (peddi). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు (Buchibabu)కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (peddi). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో..తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న బుచ్చిబాబు ‘పెద్ది’ అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘పెద్ది నుంచి లవ్ సాంగ్ వస్తుంది. అదిరిపోతుంది పాట.. ఏఆర్ రెహమాన్ ఇరగొట్టేశారు. ఆ సాంగ్‌కు ఆయన ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయేలా ఉంటుంది. ఇది మన హార్టును టచ్ చేసే మెలోడిగా నిలుస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. కానీ ఆ పాట ఎప్పుడు రిలీజ్ కాబోతుందో డేట్ అనౌన్స్ చేయలేదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా.. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, IVY ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సెనా నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

Next Story