- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమన్ ఆఫర్‌ను తిరస్కరించిన BSF జవాన్ (వీడియో)
‘తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ఆడిషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే..

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ఆడిషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాం మార్చి 3 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తిక్ జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఇటీవల భారత్-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్ చక్రపాణి హాజరయ్యాడు. అందులో చక్రపాణి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలోని పాటను పాడాడు.
దీంతో అతను పాట విన్న తమన్ మరోసారి ప్రోగ్రామ్‌కు హాజరు కావాలని కోరాడు. దానికి చక్రపాణి నిరాకరించాడు. తన సెలవులు పూర్తయ్యాయని, తాను వెంటనే వెళ్లి మళ్లీ సైన్యం చేరాలని తెలిపాడు. దీంతో ఆయనకున్న నిబద్ధత చూసి ముగ్గురు జడ్జీలు లేచి నిలబడి జవాన్‌కు సెల్యూట్ చేశారు. మిల్ట్రీ నుంచి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ వేదిక పైకి వచ్చి పాట పాడటం గొప్ప అనుభూతి అని గౌరవంగా ఉందని తమన్ తెలిపాడు. అంతేకాకుండా చక్రపాణి ఉన్నతాధికారుల నుంచి ఎవరితోనైనా మాట్లాడి షొలోకి తీసుకువస్తానని చెప్పడంతో ప్రోమో ముగిసింది.






