మామా అల్లుడు అదుర్స్.. ‘బ్రో’ సినిమాకు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్

by Disha Web Desk 6 |
మామా అల్లుడు అదుర్స్.. ‘బ్రో’ సినిమాకు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘బ్రో’. దీనికి తమిళ దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించాడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మాప్ స్టెప్పులతో దుమ్ము రేపింది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ కలెక్షన్స్‌ రాబడుతూ బాక్పాఫీసును బద్దలు కొడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూళ్లు రాబట్టిందని సమాచారం. దీంతో పవన్ కల్యాణ్ 100 కోట్ల సినిమాల్లో ఈ సినిమా కూడా యాడ్ అయింది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు, వకీల్‌సాబ్, భీమ్లానాయక్, బ్రో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు తీస్తున్నారు.

Also Read: ఆ స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పు చేసిన Samantha .. ఎందుకంటే?

Next Story