సెన్సార్ బోర్డుకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వని ‘Bro’.. ఎంత క్లీన్‌గా బయటపడిందంటే..

by Disha Web Desk 7 |
సెన్సార్ బోర్డుకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వని ‘Bro’.. ఎంత క్లీన్‌గా బయటపడిందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే సెన్సార్ బోర్డు నుంచి ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. అంటే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్‌గా భారీగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక కట్ కూడా లేకుండా సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఇందులో వల్గర్‌ సన్ని వేశాలు, చెడు మాటలు, గ్లామర్ డోస్, కాంట్రవర్సీలు లేవని అర్థం. చూడాలి మరి.. ఈ సినిమా ఎంత బాగా క్లిక్ అవుతుందో. కాగా.. ‘బ్రో’ సినిమా జూలై 28న గ్రాండ్‌గా థియోటర్లలో రిలీజ్ కానుంది.






Next Story

Most Viewed