హీరోతో బ్రేకప్.. ఫారెన్ మోడల్‌తో డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Pandey)నటుడు చంకీ పాండే(Chunky Pandey) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

హీరోతో బ్రేకప్.. ఫారెన్ మోడల్‌తో డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Pandey)నటుడు చంకీ పాండే(Chunky Pandey) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సరసన ‘లైగర్’(Liger) మూవీలో నటించింది. పూరి జగన్నాథ్ (Puri Jagannath)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. డిజాస్టర్‌గా నిలవడంతో ఇందులో నటించి విజయ్, అనన్య కెరీర్‌పై ఆ ప్రభావం పడింది. దీని తర్వాత అనన్య బాలీవుడ్‌కు చెక్కేసింది.

ఇక 2023లో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘చంద మేరా దిల్’ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. రొమాంటిక్ డ్రామాగా రాబోతుండగా.. దీనిని వివేక్ సోనీ(Vivek Soni) తెరకెక్కిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్‌పై ఈ చిత్రాన్ని కరణ్ జోహార్(Karan Johar) నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘చంద మేరా దిల్’ త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక అనన్య అడపా దడపా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తుంది.

ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి ఆదిత్య రాయ్ కపూర్‌(Aditya Roy Kapur)తో ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని కూడా తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇక త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు అనుకునే సమయంలో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయినట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, అనన్య ఓ ఫారెన్ మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి ఈవెంట్లకు, ఫంక్షన్లకు కూడా హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ అనన్య డేటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story