- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకప్ రూమర్స్.. మళ్లీ కలిసిపోయి కనిపించిన స్టార్ జంట.. వీడియో వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannah), బాలీవుడ్ హీరో విజయ్ వర్మ(Vijay Varma) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannah), బాలీవుడ్ హీరో విజయ్ వర్మ(Vijay Varma) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరు ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని స్వయంగా ఈ జంట కూడా ప్రకటించడం విశేషం. అయితే కొన్ని రోజులుగా తమన్నా, విజయ్‌ల మధ్య బ్రేకప్ అయిందని, ప్రజెంట్ వేరు వేరుగా ఉంటున్నారని, సోషల్ మీడియా(Social Media)లో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని బాలీవుడ్ మీడియాలో కోడై కూసింది. కానీ ఈ రూమర్స్ పై వీరిద్దరూ కూడా స్పందించలేదు. ఈ క్రమంలో నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. తమన్నా, విజయ్‌లు ఎంతో క్లోజ్‌గా కనిపించారు. అంతేకాకుండా విజయ్.. తమన్నా చేతిలో చేయి వేసి కారు డోర్ తీసి ఎక్కించాడు. అలాగే తన చీరను కూడా డోర్‌కి ఇరుక్కోకుండా లోపలికి సర్దాడు. ఆ తర్వాత అతను కూడా అదే కారు ఎక్కాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు అదేంటి బ్రేకప్ చెప్పుకున్నారు కదా మళ్లీ ఎప్పుడు కలుసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియో ఇప్పటిది కాదు గతంలోనిది అన్నట్లుగా తెలుస్తోంది.






