- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్: సినీ నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు..
సీనియర్ యాక్టర్, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్డెస్క్: సీనియర్ యాక్టర్, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు ఓ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రద.. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ను నడిపించారు. థియేటర్లో పనిచేస్తున్న కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో కార్మికులు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. కార్మికులు వేసిన పిటిషన్ను కొట్టివేయాలని జయప్రద దాఖలు చేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇవాళ కార్మికులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి 6 నెలలు జైలు శిక్షతో పాటు.. ఒక్కొక్కరికి 5 వేల చొప్పున ఎగ్మోర్ కోర్టు జరిమానా విధించింది.
Read More : ఆ హీరోయిన్లే డైరెక్టర్ల పక్కలోకి వెళ్తున్నారు.. సీనియర్ హీరోయిన్ జయప్రద.సంచలన కామెంట్స్.






