- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టాక్సిక్’ షూటింగ్‌కు బ్రేక్.. ఆ స్టార్ హీరోను ఫాలో అవుతూ రిస్క్ తీసుకోబోతున్న యష్..
గత కొద్ది కాలంగా హీరోలు నిర్మాతలుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. తమ సినిమాలను తామే తెరకెక్కించుకుంటూ రిస్క్ తీసుకుంటున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా హీరోలు నిర్మాతలుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. తమ సినిమాలను తామే తెరకెక్కించుకుంటూ రిస్క్ తీసుకుంటున్నారు. ముందుగా డైరెక్టర్లు ఫిక్స్ చేసుకున్నప్పటికీ షూటింగ్ దశలో ఉన్నప్పుడు పలు మనస్పర్థలు తలెత్తడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారు. దీంతో షూటింగ్‌లు ఆగిపోతున్నాయి. తాజాగా, యష్ (Yash)హీరోగా చేస్తున్న ‘టాక్సిక్’(Toxic) సినిమా విషయంలోనూ ఇలాంటి సమస్యలే తలెత్తినట్లు సమాచారం. దీంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసినట్లు టాక్. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ నుంచి తప్పుకున్నట్లు టాక్. ఇప్పటివరకు ఆమె తీసిన ఫుటేజ్ చూసి యష్ నిరాశ పడినట్లు తెలుస్తోంది. అది నచ్చకపోవడంతో రిషూట్స్ చేస్తున్నారట.
అయినా యష్ సంతృప్తి చెందక పోవడంతో పాటు షూట్ డిలే చేస్తున్నాడట. దీంతో ఇదంతా నచ్చక గీతూ తప్పుకోగా.. యష్ మెగా ఫోన్ పట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిగిలిన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ యష్ రిస్క్ తీసుకోబోతున్నాడా? హిట్ అందుకుంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హీరో విశాల్ సైతం ఇలాగే చేస్తున్నాడు. ‘మకుటం’ తెరకెక్కిస్తున్న దర్శకుడు రవి అరసుతో మనస్పర్థలు తలెత్తడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక మిగిలిన సినిమా విశాల్ దర్శకత్వంలో రాబోతుంది. ఇక ఆయనను ఫాలో అవుతూ యష్ కూడా ‘టాక్సిక్’ విషయంలో రిస్క్ తీసుకోబోతున్నాడు.






