Brahmastra movie review.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

by Disha Web Desk 6 |
Brahmastra movie review.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన చిత్రం 'బ్రహ్మస్త'. దీనిని డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమితా బచ్చన్, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌలి సమర్పించడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ఈ చిత్రాన్ని తెలుగులో సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రయాలను ట్విట్టర్ ద్వారా రకరకాలుగా తెలుపుతున్నారు. ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు. 'సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా క్లాసిక్‌గా ఉందని. అయాన్ ముఖర్జీ కథ చెప్పిన విధానం చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.

ఆలియా భట్‌తో కలిసి రణ్‌బీర్ సూపర్‌గా యాక్ట్ చేశారని అంటున్నారు. మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయని, పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు'. మరికొంత మంది నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. 'చిత్రంలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేదనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. లవ్ స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం ఈ సినిమాను మైనస్ అంటున్నారు. అయాన్ ముఖర్జీ స్టోరీ నేరేషన్, యాక్టర్స్ పర్‌ఫార్‌మెన్స్ బాగున్నాయనే సందేశాలు కనిపిస్తున్నాయి. కొంత మంది రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. మొత్తానికి సినిమాపై పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తునట్టు తెలుస్తోంది.

Also Read : ఇలా జరిగితే గుండు కొట్టించుకుంటా.. Ranbir Kapoor కామెంట్స్..

Next Story