Brahmastra box office weekend collection: Crosses ₹100 crore in India

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-12 06:58:44  IST  )

భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన 'బ్రహ్మస్త్ర' నెగెటివ్ టాక్‌తోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది..Latest Telugu News

Brahmastra box office weekend collection: Crosses ₹100 crore in India
X

దిశ, సినిమా : భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన 'బ్రహ్మస్త్ర' నెగెటివ్ టాక్‌తోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ క్రమంలో ఒక్క హిందీలోనే ఫస్ట్ వీకెండ్‌లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌లో మొద‌టిరోజున రూ.31.5 కోట్లు వ‌సూల్ చేసిన సినిమా.. రెండో రోజు రూ.37.5 కోట్లు రాబ‌ట్టింది. ఊహించ‌ని విధంగా ఆదివారం ఒక్కరోజే బాలీవుడ్‌లో రూ.42 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

మొత్తంగా ఒక్క హిందీలోనే ఇప్పటి వరకు రూ.110 కోట్లను కొల్లగొట్టింది. అంతేకాదు ఫస్ట్ వీకెండ్‌లోనే వంద కోట్ల క‌లెక్షన్స్ సాధించిన ఏడో బాలీవుడ్ సినిమాగా 'బ్రహ్మాస్త్ర' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో రణ్‌బీర్, అలియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తెలుగులో మాత్రం రెండు రోజుల్లో రూ. 6.30 కోట్ల షేర్ రాబట్టింది.

Next Story