‘Indian-2’లో బ్రహ్మానందం.. క్లారిటీ ఇచ్చేసిన శంకర్

by Disha Web Desk 9 |
‘Indian-2’లో బ్రహ్మానందం.. క్లారిటీ ఇచ్చేసిన శంకర్
X

దిశ, సినిమా: 1996లో విడుదలైన ‘భారతీయుడు’ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో చెప్పకర్లేదు. కమల్ హాసన్ హీరోగా, దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో నయా రికార్డ్స్ సెట్ చేసింది. కాగా ప్రజంట్ ఈ సినిమాకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ కూడా తెరకెక్కుతుంది. లోకనాయకుడికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, హీరో సిద్ధార్థ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త న్యూస్ బయటకి వచ్చింది. టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అయినట్లుగా కన్ఫర్మ్ అయింది. దర్శకుడు శంకర్ లేటెస్ట్ పోస్ట్ లో బ్రహ్మానందం పేరుని కూడా మెన్షన్ చేయగా.. ఆయన ఎలాంటి రోల్ చేయబోతున్నాడోననే చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి : నటుడిగా నన్ను మళ్ళీ పుట్టించింది మాత్రం ఆ దర్శకుడే: రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్


Next Story

Most Viewed