- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యతో బోయపాటి సినిమా.. క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు
by Bhoopathi Nagaiah |
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమిళ స్టార్ హీరో సూర్య కాంబోకు సంబంధించి బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమిళ స్టార్ హీరో సూర్య కాంబోకు సంబంధించి బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే రామ్ పోతినేని హీరోగా ‘స్కంద’తో తొలి పాన్ ఇండియా మూవీ తెరకెక్కించిన బోయపాటి తదుపరి చిత్రం సూర్యతో చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే హీరోతో చర్చలు జరిగాయని, సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుండగా.. వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా.. సూర్య ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడనే నమ్మకం సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది. ఇక ప్రస్తుతం సూర్య ‘కంగువ’ చిత్రంలో నటిస్తుండగా.. బోయపాటి ‘స్కంద’ సెప్టెంబరు 28న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Next Story






