బోయపాటిపై థమన్ షాకింగ్ కామెంట్స్.. అది కరెక్ట్ కాదంటూ

by Disha Web Desk |
బోయపాటిపై థమన్ షాకింగ్ కామెంట్స్.. అది కరెక్ట్ కాదంటూ
X

దిశ, సినిమా: రీసెంట్‌గా టాలీవుడ్ నుంచి విడుదలైన ‘భగవంత్ కేసరి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. బాలయ్య బాబు యాక్టింగ్‌తోపాటు ఇందులో మంచి మెసేజ్ ఉండటంతో వసూళ్లు బాగానే పెరిగాయి. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్లకు చేరువలో ఉంది. ఇకపోతే సినిమాగురించి థమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘సీన్‌లో ఎమోషన్ లేకపోతే నేను ఎంత కొట్టినా వర్కౌట్ కాదు. సచ్చిన శవాన్ని తీసుకొచ్చి బతికించమంటే ఎలా? ప్రతి టెక్నీషియన్ ఆ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే తన బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు. తన వర్క్ బాలేదన్నారని, ట్రోల్ చేశారని బాధపడటం కామన్. కానీ తను పని చేసిన సినిమా, సన్నివేశాలను, టీం వర్క్‌ను తక్కువ చేసేలా కామెంట్స్ చేయడం ఎంత వరకూ కరెక్ట్?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే బోయపాటిని ఉద్దేశించి థమన్ అలా అన్నాడని, ఎందుకంటే ఇటీవల వచ్చిన ‘స్కంద’ ఫెయిల్యూర్‌కు కారణం థమన్ మ్యూజిక్ అని బోయపాటి శ్రీను ఓ ఈవెంట్‌లో చెప్పాడు. దీంతో ‘భగవంత్ కేసరి’తో హిట్ అందుకున్న థమన్ ఈ రకంగా బోయపాటికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.



Next Story

Most Viewed