బాక్సాఫీస్ ద‌ద్దరిల్లడం ఖాయం.. ‘కాంతార-3’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కీ రోల్!

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’(Kantara) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

బాక్సాఫీస్ ద‌ద్దరిల్లడం ఖాయం.. ‘కాంతార-3’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కీ రోల్!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’(Kantara) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా రావడంతో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ముందుగా కన్నడలో రిలీజై ఘన విజయం సాధించింది. దీంతో నిర్మాతలు తెలుగు సహా ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా అన్నిచోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు.

ఆయన స్వయం దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలవగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్-2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాంతార-3 కూడా చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మేకర్స్‌తో రిషబ్ శెట్టి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. రిషబ్‌శెట్టి బిజీ షెడ్యూలే ఇందుకు కారణం. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘జై హనుమాన్‌’ మూవీలోనూ నటించాల్సి ఉంది. అలాగే మరాఠా యోధుడు ఛత్రపతి బయోపిక్‌తో పాటు ఇటీవలే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీలోనూ ఆయన నటించనున్నారు.

link

Next Story