దానికి మీ ఇద్దరూ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారు.. వర్మ పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
దానికి మీ ఇద్దరూ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారు.. వర్మ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల శ్రీ లక్ష్మి అనే అమ్మాయి గురించి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆమెను శారీలో చూసి ఇంప్రెస్ అయిన వర్మ.. సినిమా కూడా చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. అయితే.. వర్మ ‘చీర’ సినిమా గురించి శ్రీలక్ష్మి చర్చించినట్లు తెలుస్తోంది. కానీ, కథ మాత్రం చెప్పలేదని, స్క్రిప్ట్ విన్నాకే నిర్ణయం తీసుకుంటానని కేరళ మీడియాతో ఆమె మాట్లాడిందట.

వర్మ పుణ్యామా అని ఈ కేరళ కుట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగానే వైరల్ అవుతోంది. ఇక వర్మ కూడా ఆమెను వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే ఆ బ్యూటీ గురించి మరోసారి పోస్ట్ పెట్టాడు. ఈ సారి ఆ వీడియోలో శ్రీలక్ష్మితో పాటు వీడియోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్‌ను కూడా మెచ్చుకున్నాడు. మీరు సినిమాటోగ్రాఫర్‌గా, ఆమె మోడల్‌గా ఇద్దరూ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారన్నట్టుగా వర్మ షేర్ చేశాడు. ఈ పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed