మహేష్‌‌ సినిమాలో మలైకా..!? కెవ్వు కేక అంటున్న ఫ్యాన్స్

by Dishanational4 |
మహేష్‌‌ సినిమాలో మలైకా..!? కెవ్వు కేక అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'SSMB 28' నుంచి మరో అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాంచి మసాలా ఐటెమ్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పాటలో మహేష్ సరసన బాలీవుడ్ సెక్సీ బ్యూటీ మలైకా అరోరా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'గ‌బ్బర్ సింగ్'తోపాటు పలు చిత్రాల్లో ఆమె ఆడిపాడిన పాట‌ల‌న్నీ హిట్ అయిన కారణంగా మేకర్స్ తననే తీసుకునేందకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కాగా మలైకతో ఇటీవలే సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తోన్న సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తుండగా ఆగస్టు 11న ఈ చిత్రం విడుద‌లకానుంది.

ఇవి కూడా చదవండి: ఇది నమ్మశక్యంగా లేదు.. పద్మశ్రీపై రవీనా టాండన్

Next Story