ఆనంద్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఇటీవల ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆనంద్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఇటీవల ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘బేబీ-2’ (Baby-2)మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఆనంద్ దేవరకొండ ఓ పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నట్లు సమాచారం. హై-ఆక్టేన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా అక్టోబర్‌లో ప్రారంభించే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు టాక్. అలాగే త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రాబోతుంది.

తాజాగా, ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ ‘లపతా లేడీస్’ చిత్రంలో నటించిన యంగ్ బ్యూటీ నితాన్షి గోయల్ (Nitanshi Goel)ఆనంద్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్నట్లు టాక్. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోయింది. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. అందరూ బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో పాటు నితాన్షి బాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్‌లోనూ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. నటుడు అభయ్ వర్మతో రొమాన్స్ చేయనుంది. రత్న సిన్హా దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. బెనారస్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా ‘షాదీ మే జరూర్ ఆనా’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story