పుష్ప 2 సినిమాలో బాలివుడ్ స్టార్ హీరోయిన్..ఆమె ఎవరంటే?

by Dishafeatures1 |
పుష్ప 2 సినిమాలో బాలివుడ్ స్టార్ హీరోయిన్..ఆమె ఎవరంటే?
X

దిశ,సినిమా:టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో తెరంగేట్రం చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ ని అందించారు. తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించాడు. బన్నీ నటించిన పుష్ప మూవీ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా సుకుమార్ కాంబోలో పుష్ప 2తో ముందుకు రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. తాజాగా విడుదల చేసిన టీజర్ కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ ‌‌‌‌‌‌తో‌ ప్రభంజనాన్ని సృష్టించినది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండియా మొత్తం ఒకటే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బన్నీ లుక్స్ అందరిని ఆశ్చర్య పరిచింది.

ఇదిలా ఉంటే..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప 2లో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉండబోతుందట. అయితే ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది చెప్పకుండా డైరెక్ట్ గా ఇంటర్వెల్ లో రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే హీరోయిన్ ఉంది అనే సమాచారం అందుతుంది కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీగా చెప్పడం లేదు. అయితే ఆమె ఎవరో తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే మరి. ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయి అతన్ని మించిన హీరో ఇండస్ట్రీలోనే మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతియోశక్తి లేదు..

Read More...

అల్లు అర్జున్‌లో మరో యాంగిల్.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాడట



Next Story

Most Viewed