- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్‌కు తల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ జరుగుతుంది. 1969 కాలంలో చైనా, బూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, తల్లి సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీలో ఎన్టీఆర్‌కు తల్లిగా సీనియర్ బాలీవుడ్ యాక్టర్ కాజోల్ నటిస్తున్నారని, అలాగే మలయాళ నటుడు టివినో థామస్ కీలక పాత్రలో కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






