- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ ‘జైలర్-2’ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఏ పాత్రలో కనిపించనుందంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్-2’(Jailer-2). ఈ సినిమా సూపర్ హిట్ అయిన ‘జైలర్’ కు సీక్వెల్‌గా తెరకెక్కబోతుంది.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్-2’(Jailer-2). ఈ సినిమా సూపర్ హిట్ అయిన ‘జైలర్’ కు సీక్వెల్‌గా తెరకెక్కబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లతో పాటు నందమూరి బాలకృష్ణ, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ‘జైలర్-2’లో వచ్చే ట్విస్టులు, క్యామియే రోల్స్ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో అంచానలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జైలర్-2’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా న్యూస్ మాత్రం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎలాంటి పాత్రలో నటించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ న్యూస్ విన్న రజినీ ఫ్యాన్స్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అంటున్నారు.






