కొండచిలువను పెంచుకుంటున్న బాలీవుడ్ విశ్వసుందరి!!

by Disha Web Desk 9 |
కొండచిలువను పెంచుకుంటున్న బాలీవుడ్ విశ్వసుందరి!!
X

దిశ, సినిమా: అప్పట్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్‌కు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌‌లో కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 1994లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013 లో మదర్ థెరిసా ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకుంది.

రీసెంట్‌గా హిందీలో ఓ వెబ్ సిరీస్‌లో నటించి.. ఆడియన్స్ మెప్పు పొందింది. ఈ అమ్మడు వయస్సు ప్రస్తుతం 48 సంవత్సరాలు. అయినప్పటికీ ఈమె ఇంకా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. సుస్మితాసేన్ ఇప్పటికే చాలామంది తో డేటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇటీవలే బాలీవుడ్ ఓ స్టార్ డైరెక్టర్ మరో హీరోయిన్‌ అండ్ సుస్మిత సేన్‌తో డేటింగ్‌లో ఉన్నాను, వారి తప్పేం లేదు.. వారు మంచి పర్సన్స్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నా భార్య కూడా మంచిదేనని తెలిపాడు.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సుస్మితా సేన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ మాజీ విశ్వసుందరి ప్రస్తుతం ఓ కొండచిలువను పెంచుకొంటుందట. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘వామ్మో.. వెరీ డేర్ గర్ల్’ అంటూ సుస్మిత సేన్‌పై ఫ్రౌడ్ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story

Most Viewed