- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగా, బండగా ఉన్నావని అవమానం.. కట్ చేస్తే ప్రెజెంట్ ఇండస్ట్రీని ఏలుతోన్న స్టార్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా చాలా ముఖ్యం.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా చాలా ముఖ్యం. అయితే ఓ హీరోయిన్ అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీకి వెళ్తే నీకెందుకు సినిమాలు, నల్లగా, బండగా ఉన్నావని హేళన చేసినవారే.. నేడు ముఖం చాటేసుకునే పరిస్థితి వచ్చింది. మరీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోన్న బాలీవుడ్ బ్యూటీ కాజోల్. తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై తనకు కెరీర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది.
నల్లగా, బండగా ఉన్నావు అని ఎగతాళి చేశారని, ఆ సమయంలో చాలా బాదేసిందని ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అయ్యింది. అప్పుడు ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయానని పేర్కొంది. మెల్లిగా అలాంటి మాటల నుంచి తెరుకుని గ్లామర్ పై జాగ్రత్తలు తీసకున్నానని, కానీ ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని వెల్లడించింది. ఇటీవలే ఈ బ్యూటీ 50 వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం కాజోల్ బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూపర్ స్టార్ అజయ్ దేవగన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.






