- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్ కనగరాజ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ.. వేశ్యగా కనిపించడంతో నెటిజన్లు షాక్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఇటీవల ‘కూలీ’ చిత్రంతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఖైదీ-2, మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించాల్సి ఉండగా.. డైరెక్షన్‌కి బ్రేక్ ఇచ్చి కొత్త అవతారమెత్తబోతున్నాడు. హీరోగా బిగ్ స్క్రీన్‌పై కనిపించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా మొదలవగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
ఇక ఇందులో లోకేష్‌కు జోడీగా పలువురి భామలను లైన్‌లో పెట్టినప్పటికీ చివరగా.. బాలీవుడ్ హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్లు టాక్. తాజాగా, ఈ విషయంపై చిత్రబృందం స్పందించి బిగ్ అప్డేట్ ఇచ్చింది. లోకేష్ కనకరాజ్ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘DC’ టైటిల్‌తో రాబోతుండగా.. ఇందులో లోకేష్ కనగరాజ్ దేవదాసుగా కనిపించనుండగా.. ఆయనకు జోడీగా చంద్ర పాత్రలో బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి (Wamiqa Gabbi)నటించనుంది. ఇక ఇందులో వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక రిలీజ్ చేసిన టీజర్‌లో లోకేష్ ముఖమంతా రక్తంతో గన్ పట్టుకుని హోటల్ నుంచి బయటకు పోతుండగా.. ఇక ఆమె జడలో గులాబీ పువ్వు పెట్టుకుని నిరోధ్ ప్యాకెట్ తీసుకుని అతని కోసం ఒక గదిలోకి వెళ్లడం.. అక్కడ వాళ్లిద్దరూ ఎదురు పడటం.. అక్కడితో ఈ టైటిల్ టీజర్ ను కట్ చేశారు. ఇది చాలా బోల్డ్ గా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. ఈ సినిమా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా.. బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మూవీని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయబోతున్నారు.






