పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఇంట్లో చెప్పడంతో..

by Disha Web Desk 7 |
పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఇంట్లో చెప్పడంతో..
X

దిశ, సినిమా: 2002లో ఫేమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నేహా ధూపియా ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్‌లో ఒక ఊపు ఊపింది. తెలుగులో ఒకటి, రెండు చిత్రాల్లో నటించింది. ఇక పోతే నేహా 2018 మేలో, బాలీవుడ్ నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. కానీ వీరి పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే ఒక బిడ్డ జన్మించాడు. దీంతో అప్పుడు ఈ జంట మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి.. ఈ ట్రోల్స్‌పై సమాధానం ఇచ్చింది. ‘అంగద్, నేను పెళ్లికి ముందే సహజీవనం చేశాం. ఏళ్లపాటు ఒకే ప్లాట్‌లో కలిసి ఉన్నాము. అలా ప్రెగ్నెంట్ అయ్యాను. ఇదే విషయాన్ని చాలా భయంతో తల్లిదండ్రులకు చెప్పడంతో మూడు రోజుల్లో మా పెళ్లి చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది నేహా.

Read More: ‘బిచ్చగాడు 3’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ

Next Story

Most Viewed