- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్- హను రాఘవపూడి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఏ పాత్రలో నటిస్తుందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘సలార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘సలార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నారు. సలార్-2, కల్కి-2, స్పిరిట్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ చేయనున్నారు. ఇది 1970ల నాటి పీరియాడికల్ వార్ డ్రామా అని సమాచారం. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో డార్లింగ్ సరసన ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismail) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తవగా.. ఓ పోస్టర్ కూడా విడుదల అయి అంచనాలను పెంచేసింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కాబోతుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామిక గబ్బి(Wamiqa Gabbi) కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఆమెతో చిత్రబృందం చర్చలు కూడా జరపగా.. వామికా నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






